కేంద్రం సంచలనం.. బయోమెట్రిక్ రద్దు !
1 min readపల్లెవెలుగువెబ్ : కరోన వైరస్ విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తక్షణమే ఇది అమలులోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమలులో ఉంటుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి డా. జితేంద్ర సింగ్ తెలిపారు. ఉద్యోగుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. గతంలో కూడ కరోన నేపథ్యంలో ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.