ఢిల్లీ సీఎంకు కరోన పాజిటివ్
1 min readపల్లెవెలుగువెబ్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోన బారినపడ్డారు. లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేజ్రీవాల్ తెలిపారు. కరోన స్వల్ప లక్షణాలు ఉన్నట్టు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.