NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి పేర్ని నానికి ఆర్జీవి ప్ర‌శ్న‌ల వ‌ర్షం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల త‌గ్గింపు పై వివాదం కొన‌సాగుతూనే ఉంది. తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏపీ మంత్రి పేర్నినానికి ప్ర‌శ్న‌ల బాణాలు సంధించారు. వాటికి స‌మాధానం చెప్పాల‌ని కోరారు.

  • సినిమాతో సహా ఏదైనా ఉత్పత్తికి మార్కెట్‌ ధర నిర్ణయించడంలో ప్రభుత్వం పాత్ర ఎంతమేరకు ఉంటుంది?.
  • గోధుమలు, బియ్యం, కిరోసిన్, వంటనూనె వంటి నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడినప్పుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకుని అందుబాటులో ఉండేలా ధరలను నిర్ణయిస్తాయని తెలుసు. అయితే, అది సినిమాలకు ఎలా వర్తిస్తుంది? సినిమా టికెట్ల ధరను ప్రభుత్వమే నిర్ణయించే విధంగా దారి తీసిన పరిస్థితులేంటి?.
  • పేదలకు సినిమా చాలా అవసరమని మీరు భావిస్తే.. విద్యా, వైద్యసేవలకు రాయితీ ఇస్తున్నట్లు సినిమాలకీ రాయితీ ఇవ్వొచ్చు కదా? .
  • పేదలకు బియ్యం, పంచదార అందించడానికి రేషన్‌ షాపులు ఉన్నట్లే.. రేషన్‌ థియేటర్ల ఏర్పాటును పరిగణనలోకి తీసుకొని అటువంటి ఆలోచనలు చేస్తారా?. అంటూ ప్ర‌శ్న‌లు సంధించారు. వీటికి ఏపీ మంత్రి పేర్నినాని స‌మాధానం చెప్పాల‌ని కోరారు. ప్ర‌భుత్వం స్పందిస్తుందో.. లేదో వేచిచూడాలి.
                                         

About Author