సూర్య నమస్కారాలు చేయొద్దు !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశవ్యాప్తంగా పాఠశాలల్లో సూర్య నమస్కారాలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల పై ముస్లిం పెద్దలు మండిపడుతున్నారు. సూర్య నమస్కారాల కార్యక్రమాలకు ముస్లిం విద్యార్థులు దూరంగా ఉండాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) ఆదేశించింది. జనవరి 1 నుంచి 7 వరకు దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ సూర్య నమస్కారాల కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలను ఏఐఎంపీఎల్‌బీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా ఖలీద్ సైఫుల్లా రహమానీ ఓ ప్రకటన విడుదల చేశారు. భారత దేశం లౌకికవాద దేశమని, ఇక్కడ మెజారిటీ మతస్థుల ఆచారాలు, సంప్రదాయాలను ఇతర మతాలపై రుద్దకూడదని చెప్పారు. ముస్లిం విద్యార్థులు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు.