ఏపీ అప్పు ఎంత.. ప్రజలకు ఇచ్చింది ఎంత ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ ప్రభుత్వం పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైందని ఆరోపించారు. ఇష్టారీతిన అప్పులు చేశారని, కాగ్ లెక్కలు అడిగితే చెప్పడం లేదని అన్నారు. ఏపీలో ప్రస్తుతం 7 లక్షల కోట్ల అప్పు ఉందని అన్నారు. 2019 నాటికి 3.14 లక్షల కోట్లు ఉంటే ప్రస్తుతం 7 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. 4వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు, ఫించన్లు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఆదాయం లేకుండా అప్పులు చేసి.. దానికి సంక్షేమం అని పేరు పెట్టారని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఎంత అప్పు చేశారు.. ప్రజలకు ఎంత ఇచ్చారనే దాని పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.