రూ. 5 లక్షల వరకు ఉచిత తక్షణ నగదు బదిలీ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఎస్బీఐ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉచిత ఐఎంపీఎస్ (తక్షణ నగదు బదిలీ) చెల్లింపుల పరిమితిని ప్రస్తుత రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచే ఇది అమల్లోకి వస్తుంది. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ లేదా తన యాప్ యోనో ద్వారా జరిగే డిజిటల్ బ్యాంకింగ్ సేవలు పొందే ఖాతాదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఎస్‌బీఐ ఈ చర్య తీసుకుంది. బ్యాంకు శాఖల ద్వారా జరిగే ఐఎంపీఎస్ నగదు బదిలీ రూ.1,000 లోపు ఉన్నా ఎలాంటి ఛార్జీలు ఉండవు. చెల్లింపులు రూ.1,000 నుంచి రూ.2 లక్షల లోపు ఉంటే మాత్రం రూ.2 నుంచి రూ.12 సర్వీసు ఛార్జి ప్లస్ జీఎ్‌సటీ విధిస్తారు. అదే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటే మాత్రం రూ.20 సర్వీస్ ఛార్జి ప్లస్ జీఎ్‌సటీ వసూలు చేస్తారు.