ప్రాణాలతో రాగలిగా.. కృతజ్ఞతలు : మోదీ
1 min readపల్లెవెలుగువెబ్ : పంజాబ్ లో ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. పంజాబ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేయడానికి ప్రధాని మోదీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వార వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించలేదు. దీంతో రోడ్డు మార్గం ద్వార వెళ్లాలని నిర్ణయించారు. అయితే మోదీ ప్రయాణిస్తున్న కాన్వాయ్ మార్గంలో ఓ ఫ్లైఓవర్ వద్ద ఆందోళనకారులు రహదారిని బ్లాక్ చేశారు. దీంతో ప్రధాని మోదీ కాన్వాయ్ ఫ్లైఓవర్ పైనే 20 నిమిషాల పాటు ఆగిపోయింది. వెంటనే మోదీ తన పర్యటన రద్దు చేసుకుని ఎయిర్ పోర్ట్ కు వెళ్లిపోయారు. ఈ ఘటన పై మోదీ అసహనం వ్యక్తం చేశారు. మీ సీఎంకు కృతజ్ఞతలు. కనీసం నేను భఠిండా ఎయిర్ పోర్టుకు ప్రాణాలతో తిరిగి రాగలిగా
అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఈ ఘటన పై కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్ పోలీసు శాఖ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. కాంగ్రెస్ వల్లే ఇందతా జరిగిందని బీజేపీ ఆరోపించింది. బీజేపీ ఆరోపణలకు కాంగ్రెస్ ఖండించింది.