కోవాగ్జిన్ టీకా తీసుకున్నాక.. పారాసిటమాల్ అవసరం లేదు
1 min readపల్లెవెలుగువెబ్ : 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వారు కోవాగ్జిన్ టీకా తీసుకున్నాక ఎలాంటి మందులు అవసరం లేదని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. చాలా వ్యాక్సినేషన్ సెంటర్లలో టీకా వేసుకున్నాక పారాసిటమాల్ వేసుకోమని చెబుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, టీకా తీసుకున్నాక ఎలాంటి పెయిన్ కిల్లర్లు అవసరం లేదని స్పష్టం చేసింది. టీకా తీసుకున్నాక అతికొద్ది మందిలో మాత్రమే దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపింది. ఒకవేళ అవసరమైతే వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని సూచించింది.