PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాలల హక్కులు కాపాడాలి : జేసీ (అభివృద్ధి) ఇమాన్​ శుక్ల

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఏలూరు : జిల్లాలో ఉన్న బాలలు అందరూ వారి హక్కులు స్వేచ్ఛగా అనుభవించి,మంచి వ్యక్తులుగాఎదిగి అభివృద్ధి చెందేందుకు కృషిచేయాలని జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి) హిమాషు శుక్ల అన్నారు.  శుక్రవారం కలెక్టరేట్లోని  గోదావరి సమావేశ మందిరంలో మహిళా భివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న సమగ్ర బాలల సంరక్షణ పథకం ద్వారా అమలు చేస్తున్న బాలల న్యాయ ఆదరణ, సంరక్షణ చట్టం2015,బాలల కొరకు ఉన్న వివిధ చట్టాల అమలు పర్యవేక్షణ ల కొరకు ఏర్పాటు చేసిన సంస్థలు నిర్వహించ వలసిన కార్యక్రమాలు,ఇతర శాఖల తో సమన్వయ సమావేశం’జిల్లా బాలల సంరక్షణ సోసిటీ కమిటీ మీటింగ్ జాయింట్ కలెక్టర్( అభివృద్ధి) శ్రీ హిమాన్షు శుక్లా  అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న బాలల అందరూ వారి హక్కులు స్వేచ్ఛగా అనుభవించి మంచి వ్యక్తులుగా ఎదిగి అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్న వ్యవస్థలు,వ్యక్తులు అంకిత భావంతో పనిచేయాలన్నారు.  చట్టంలో నిర్దేశించిన కాలంలో రిపోర్ట్ లు తయారు చేయాలని అన్నారు.అందరూ ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ  నాణ్యమైన/గుణాత్మక మైన పనులు చేయాలని సూచించారు.సెక్రెటరీ,డిఎల్ ఎస్ఏ జడ్జి డి బాలకృష్ణయ్య మాట్లాడుతూ ఆదరణ మరియు సంరక్షణ అవసరం అయిన బాలల విషయంలో సీ డబ్ల్యు సి వారు వారి పరిధికి లోబడి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.  ఫోక్స్ కేస్ ల విషయంలో అందిస్తున్న కంపెన్షషన్ మరియు కేసులలో జరుగుతున్న ట్రయిల్ లను స్పీడ్ గా చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్ పి సుబ్బరాజు,జె డి సోసిల్ వెల్ఫేర్ శ్రీ మధుసూదన్, డిఇఓ శ్రీమతి రేణుక,పిడి ఐసిడిఎస్  శ్రీమతి విజయకుమారి,పిడి డిఆర్డి ఏ  శ్రీనివాసరావు,సీ డబ్ల్యు సి  చైర్మన్ రిబ్కా రాణి,సభ్యులు ఐ సిపి ఎస్ జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సీ హెచ్ సూర్య చక్రవేణి,ఇతర  అధికారులు,డి సిపియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author