నిరాశ పరిచిన పీఆర్సీ ప్రకటన : ఎస్టీయూ
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు :12 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ,కార్మికులు, ఎపుడెపుడా అని ఎదురు చూసిన 11వ పిఆర్సీ పై ముఖ్యమంత్రి ప్రకటన తీవ్ర నిరాశ పరిచిందన్నారు STU రాష్ట్రసహాధ్యక్షులు హెచ్. తిమ్మన్న. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేకించి ఫిట్ మెంట్ కనీసం 35% ఆశించామని కానీ 23.29% ప్రకటించడం బాధాకరమన్నారు. సిపియస్ రద్దు పై నిర్ణయం వాయిదా వేయడం కూడ ఉద్యోగులను అవమానపరచడమే కాకుండా హామీని సైతం నెరవేర్చలేదన్నారు. విరమణ వయస్సు 60 నుండి 62సం.లు పెంపు మేము అడగలేదని, మొత్తానికి 11వ పిఆర్సీ సంతృప్తికరంగా లేదన్నారు.