PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ‌న‌మా రాఘ‌వ అరెస్ట్.. పార్టీ నుంచి స‌స్పెండ్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పాల్వంచ‌కు చెందిన నాగ‌రామ‌కృష్ణ ఆత్మ‌హత్య కేసులో ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు కొడుకు వ‌న‌మా రాఘ‌వేంద్ర‌ను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయనను టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించగా.. రాత్రి 10 గంటలకు రాఘవను అదుపులోకి తీసుకున్నట్టు కొత్త గూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ ప్రకటించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పరిసరాల్లో రాఘవ ఉన్నట్టు సమాచారం అందిందని.. దమ్మ పేట మీదుగా రాజమండ్రికి వెళ్తున్న రాఘవ వాహనాన్ని పోలీసులు వెంబడించి పశ్చిమగోదావరి జిల్లా చింతలపుడి వద్ద అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. రాఘవను పాల్వంచకు తరలించామని.. ప్రాథమిక విచారణ పూర్తి అయ్యాక కోర్టులో హాజరుపరుస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు.

                                   

About Author