గూగూల్ క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక !
1 min readపల్లెవెలుగువెబ్ : గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. గూగుల్ క్రోజ్ బ్రౌజర్ లో భద్రతా లోపాలు ఉన్నట్టు గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ క్రోమ్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. బ్రౌజర్‌లో కొన్ని విభాగాల్లో లోపాలు ఉన్నట్లు సెర్ట్-ఇన్ గుర్తించింది. యూజ్ ఆఫ్టర్ ఫ్రీ ఇన్ స్టోరేజీ, స్క్రీన్ కాప్చర్, సైన్ ఇన్, స్విఫ్ట్‌షేడర్, పీడీఎఫ్, ఆటోఫిల్, ఫైల్ మెనేజర్ ఏపీఐతో పాటు డెవ్‌టూల్స్, నావిగేషన్, ఆటోఫిల్, బ్లింక్, వెబ్‌షేర్‌లో, పాస్‌వర్డ్, కంపోసిటింగ్‌లో అనవసరమైన ఇంప్లిమెంటేషన్లు లోపాలకు కారణమని సెర్ట్-ఇన్ పేర్కొంది. ఈ లోపాలతో సైబర్‌నేరస్తులు ఆయా క్రోమ్ యూజర్ల డేటాను తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది.