రేషన్ డీలర్లకు ఊరట !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో రేషన్ డీలర్లకు ఊరట లభించింది. గోనె సంచుల డబ్బులు ఇచ్చేది లేదంటూ గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో డీలర్ల సంఘం హైకోర్టుకు వెళ్లింది. గోనె సంచులను డబ్బులు ఇచ్చే తీసుకెళ్లాలని డీలర్లకు ప్రభుత్వానికి సూచించింది. దశాబ్దాలుగా కమిషన్‌తో పాటు, గోనె సంచుల ద్వారా రేషన్ డీలర్లు ఆదాయం పొందుతున్నారు. డీలర్ల తరపున హైకోర్టులో న్యాయవాది శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. గోనె సంచుల డబ్బులు రేషన్ డీలర్లకే చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఒక్కో సంచికి ఇరవై రూపాయలు చొప్పున ఇచ్చి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు తీర్పుపై డీలర్ల సంఘం నాయకులు మండాది వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు.