ఆత్మకూరు ఏపీలో ఉందా ?.. సోమువీర్రాజు లేఖ !
1 min readపల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లా ఆత్మకూరు ఘటన పై బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. ఆత్మకూరు ఏపీలో ఉందా? లేదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. ఆత్మకూరు పాకిస్థాన్లో ఒక భాగమని ముఖ్యమంత్రి భావిస్తున్నారా? అని నిలదీశారు. ఆత్మకూరులో ఘటన జరిగి 24 గంటలు గడిచినా ముఖ్యమంత్రి ఎందుకు స్వయంగా ప్రకటన చేయలేదన్నారు. ఒక వర్గం వారిపై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తే ముఖ్యమంత్రి మౌనం దేనికి సంకేతమని సోము వీర్రాజు ప్రశ్నించారు.