కొత్త సంవత్సరంలో వీటి ధరలు పెరిగాయి !
1 min readపల్లెవెలుగువెబ్ : కొత్త సంవత్సరంలో గృహోపకరణాల ధరలు పెరిగాయి. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వంటి వినియోగ వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ముడి పధార్థాల ధరలు, రవాణ చార్జీలు పెరగడంతో ఆ భారాన్ని కంపెనీలు వినియోగదారుల పై బదిలీ చేయనున్నారు. వాషింగ్ మిషన్ల ధరలు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్యానసోనిక్, హయర్, ఎల్జీ వంటి సంస్థలు ఇప్పటికే ధరలు పెంచాయి. మిగిలిన సంస్థలు కూడ ఇదే బాటలో పయనించే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది త్రైమాసికం చివరి నాటికి ధరలు పెంచే అవకాశం కనిపిస్తోంది. రవాణ చార్జీలు, ముడిపదార్థాల ధరలు పెరగడంతో ఆ భారాన్ని వినియోగదారుల పై మోపక తప్పదని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి.