కరోన భయం.. కుటుంబం ఆత్మహత్య !
1 min readపల్లెవెలుగువెబ్ : కరోన భయంతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. తమిళనాడులోని మధురై లో ఈ ఘటన జరిగింది. మదురై కల్‌మేడు ఎంజీఆర్ నగర్‌లో నాగరాజన్, లక్ష్మీ నివసిస్తున్నారు. వీరికి అనిత, జ్యోతిక , శిబిరాజ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో నాగరాజన్ హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురికావటంతో తల్లిదండ్రుల సేవ చేసేందుకు జ్యోతిక తన మూడేళ్ల కుమారుడు రితీష్‌తో పుట్టింటికి వచ్చింది. కొద్ది రోజులకు నాగరాజన్ మృతి చెందాడు. నెలల తేడాలో కుమార్తెను, భర్తను పోగొ ట్టుకుని శోకంతో లక్ష్మి క్రుంగిపోయింది. ఈ నేపథ్యంలో జ్యోతికకు జలుబు, దగ్గు అధికమై ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించగా ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ సంగతి తెలిసి లక్ష్మి మరింత దిగులు చెంది ఇంటిలో ఒకరికి కరోనా సోకింతే అందరికీ వ్యాపిస్తుందని భయపడింది. జ్యోతిక కూడా మరింత క్రుంగిపోయి కరోనాతో ఇబ్బంది పడటం కంటే చావటం మేలనుకుంది. ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. దానికి ఆమెకూడా అంగీకరించింది.
శనివారం రాత్రి లక్ష్మి, కుమార్తె జ్యోతిక, ఆమె కుమారుడు రితీష్, తమ్ముడు శిబిరాజ్ విషం తాగి పడుకున్నారు. ఆదివారం ఉదయం లక్ష్మి ఇంటి తలుపులు చాలసేపటిదాకా తెరవకపోవటంతో చుట్టు పక్కలవారు తలుపుతట్టారు. లోపల గడియపెట్టి ఉండటం, ఎలాంటి అలికిడి లేకపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్ళి చూడగా జ్యోతిక, ఆమె మూడేళ్ల కుమారుడు రితీష్ శవాలుగా పడి ఉండటం చూసి దిగ్ర్భాంతి చెందారు.