కరోన వ్యాక్సిన్ల చోరీ !
1 min readపల్లెవెలుగువెబ్ : హైదరాబాద్ నగరంలో కరోన వ్యాక్సిన్ల చోరీ జరిగింది. నగరంలోని జాంబాగ్ యూపీహెచ్ లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. గుర్తుతెలియని దుండగులు 17 కోవాగ్జిన్, 27 కోవిషీల్డ్ వయల్స్ చోరీ చేశారు. వీటితో పాటు మూడు కంప్యూటర్లు కూడ ఎత్తుకుపోయారు. చోరీకి గురైన వయల్స్ తో 340 కోవీషీల్డ్ డోసులు, 270 కోవాగ్జిన్ డోసులు ఇవ్వవచ్చు. ఈ ఘటన పై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.