నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్.. గాంధేయవాది..
1 min readఎమ్మెల్యే ను విమర్శించితే సహించేది లేదు..
ఎమ్మెల్యే వర్గం వైసీపీ నాయకు హెచ్చరిక..
పల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: అభివృద్ధే ధ్యేయంగా.. కుల మత వర్గ విభేదాలకు తావులేకుండా ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తూ గాంధేయవాదిగా ఎలాంటి మచ్చలేని నాయకుడిగా నియోజకవర్గ ప్రజల అభిమానం పొందుతున్న నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ పైన విమర్శలు చేయడం వైసీపీ పార్టీకి చెందిన మరో వర్గం నాయకులకు వైసీపీ నాయకులు కౌన్సిలరు ధర్మారెడ్డి , సింగిల్ విండో చైర్మన్ బాలస్వామి, దామగట్ల రత్నం, తాటిపాటి అయ్యన్న, మాల్యాల శంకరయ్య. సోమవారం నందికొట్కూరు ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాల్యాల గ్రామంలో పొలం రాస్తా సమస్యను రాజకీయాల కోసం అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యే పైన ఫ్యాక్షన్ ముద్ర వేయడానికి కుట్రలు చేయడం తగదన్నారు. ఎమ్మెల్యే సహాయ సహకారంతో లబ్ధి పొందిన వారే ఆయనను విమర్శించడం మంచి పద్ధతి కాదన్నారు.వైసీపీ పార్టీ గుర్తు పైన గెలిచిన వారు వైసీపీ ఎమ్మెల్యే ను విమర్శించడం ఎంపీపీ మురళి కృష్ణా రెడ్డికి సరికాదన్నారు.మాల్యాల గ్రామానికి చెందిన చంద్రశేఖర్ నాయుడు, ఎల్లా నాయుడు లు సర్పంచ్ ఎన్నికలలో ఎమ్మెల్యే బిక్షతో పదవులు చేపట్టిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. విమర్శలు చేసే ముందు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజలు ప్రశాంతంగా జీవించాలన్నదే ఎమ్మెల్యే అభిమతం అన్నారు. వైసీపీ శ్రేణులు కలిసికట్టుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు జగన్ రఫీ ,తదితరులు పాల్గొన్నారు.