NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఐ నుంచి కాపాడండి.. మ‌హిళా కౌన్సిల‌ర్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌కాశం జిల్లా చీరాల ప‌ట్ట‌ణంలోని వైకాపా మ‌హిళా కౌన్సిల‌ర్ సూర‌గాని ల‌క్ష్మి.. సీఐ రాజ‌మోహ‌న్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వ్యాపారాన్ని దెబ్బ‌తీసి.. త‌మ‌ను ఇబ్బందిపెడుతున్న సీఐ నుంచి కాపాడాల‌ని సీఎంకు విజ్ఞ‌ప్తి చేస్తూ ఆమె వీడియో విడుద‌ల చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. డిసెంబ‌ర్ 31న అర్ధ‌రాత్రి సీఐ రాజమోహ‌న త‌మ బార్ అండ్ రెస్టారెంట్ లోకి వచ్చి…త‌న భ‌ర్త‌ను దుర్బాష‌లాడార‌ని, ప్రాధేయ‌ప‌డినా విన‌కుండా దురుసుగా ప్ర‌వర్తించార‌ని అన్నారు. దీని పై జిల్లా ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేశామ‌ని, అయినా మ‌రోసారి వ‌చ్చి వ్యాపారం ఎలా చేస్తావో చూస్తా అంటూ బెదిరించార‌ని ఆమె ఆరోపించారు. సీఐ రాజ‌మోహ‌న్ నుంచి త‌మ‌ను కాపాడాల‌ని ఆమె సీఎం జ‌గ‌న్ ను కోరారు.

                                              

About Author