వడ్డె ఓబన్నకు ఘననివాళి
1 min readబ్రిటీష్ వారి నిరంకుశత్వాన్ని ఎదిరించిన ధీశాలి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వై.నాగేశ్వరరావు యాదవ్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: బ్రిటిష్ వారి నిరంకుశత్వాన్ని ఎదురించి..అణిచి వేసిన ధీశాలి వడ్డె ఓబన్న అని కొనియాడారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర గొర్రెల పెంపకందారులు ఫెడరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్ గారు, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల లక్ష్మీకాంత్. మంగళవారం కర్నూలు బీసీ భవనంలో వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాంబాబు గారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు శకుంతలమ్మ గారు, జిల్లా మహిళా నాయకురాలు జీవి చంద్రికమ్మ గారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జ్యోతిస్య శాస్త్రవేత్త పుల్లయ్య స్వామి, తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ ప్రెసిడెంట్ సత్రం రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ నాయకులు రాజు యాదవ్ ,రమేష్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి గణ మద్దయ్య, బీసీ సంఘం నాయకులు మద్దయ్య , వెంకట స్వామి , జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి రామ సుబ్బయ్య , తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ప్రసిడెంట్ జేమ్స్ గారు,తిరుపతయ్య , నంద్యాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు భజారన్న గారు,పుల్లయ్య, శ్రీనివాసులు , మల్లయ్య గారు,మద్దిలేటి ,వడ్డెర సంగం నాయకులు,జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు,బీసీలు,ఓభన్న గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వై.నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ తెల్లదొరల అక్రమ పన్ను వసూళ్లపై తిరుగుబాటు చేసిన ధైర్యశాలి, రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి కుడి భుజంగా ఉంటూ ఉద్యమంలో పాల్గొన్న యోధుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. బీసీలు రాజ్యాధికారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. అనంతరం వడ్డెర సంక్షేమమంకోసం కృషిచేసిన వడ్డెర సంఘం నాయకులు వెంకటస్వామి ,తిరుపతయ్య,మల్లయ్య ,నాగరాజును ఘనంగా సన్మానించారు.