పెరిగిన కరోన కేసులు… 23 మంది మృతి !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశ రాజధాని ఢిల్లీలో కరోన కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం కొత్తగా 21 వేల కరోన కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వల్ల 23 మంది చనిపోయినట్లు వైద్య అధికారులు తెలిపారు. సోమవారం రోజు 19,166 కోవిడ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. ఢిల్లీలో రోజువారీ కోవిడ్ పాజిటివిటీ రేటు 25.65 శాతంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. నగరంలో కోవిడ్ -19 యాక్టివ్ కేసులు 9,000కి పైగా పెరిగాయని, ప్రస్తుతం 74,881కి చేరుకున్నాయని ప్రభుత్వం తెలిపింది.