భారీగా తగ్గిన వంటనూనె.. కిలో ఎంతంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఆకాశాన్నంటిన వంటనూనె ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దేశవ్యాప్తంగా ప్రధాన రిటైల్ మార్కెట్లలో కిలో వంటనూనెపై రూ.5-20 వరకు ధరలు తగ్గినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. రిటైల్ మార్కెట్‌లో వేరుశెనగ నూనె ఆల్ ఇండియా సగటు రిటైల్ ధర కిలో రూ.180, ఆవనూనె కిలో రూ.184.59, సోయా ఆయిల్ కిలో రూ.148.85, సన్ ఫ్లవర్ ఆయిల్ కిలో 162.4, పామాయిల్ కిలో ధర రూ.128.5గా ఉన్నట్లు తెలిపింది. అయితే, అక్టోబర్ 1, 2021న ఉన్న ధరలతో పోలిస్తే వేరుశెనగ మరియు ఆవనూనెల రిటైల్ ధరలు కిలోకు రూ.1.50-3 తగ్గాయి. సోయా మరియు సన్ ఫ్లవర్ నూనెల ధరలు కిలోకు రూ.7-8 తగ్గినట్లు కేంద్రం తెలిపింది.