PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అద‌ర‌గొట్టిన ఇన్ఫోసిస్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాల్లో అద‌ర‌గొట్టింది. కంపెనీ ఆదాయం 23 శాతం పెరిగి.. 31,867 కోట్ల‌కు చేరింది. గ‌త ఏడాది ఇదే త్రైమాసికంలో 25,927 కోట్ల ఆదాయం పొందింది. బ్యాంకింగ్ , ఫైనాన్షియ‌ల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ విభాగాల్లో వ‌స్తున్న ఆదాయంలో 16.8 శాతం వృద్ధి న‌మోదైన‌ట్టు కంపెనీ తెలిపింది. 11.8 శాతం స్టాండ్ అలోన్ లాభంతో 5,809 కోట్లు సంపాదించింది. త‌మ పై క్లయింట్ల‌కు ఉన్న న‌మ్మ‌కానికి ఈ ఫ‌లితాలే నిద‌ర్శ‌న‌మ‌ని ఇన్ఫోసిస్ సీఈవో స‌లీల్ ఫ‌రేఖ్ తెలిపారు. డిజిటిల్ ట్రాన్ఫ‌ర్మేష‌న్ లో త‌మ కంపెనీ అండ‌గా ఉంటుంద‌ని పేర్కొన్నారు.

                                                

About Author