సీఎం జగన్ ను కలవనున్న మెగాస్టార్ !
1 min read
పల్లెవెలుగువెబ్ : మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిన కలవనున్నారు. గురువారం మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో చిరును కలిసేందుకు జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఇరువురు కలిసి లంచ్ చేయనున్నారు. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో నెలకొన్న సమస్యల పై చర్చించే అవకాశం ఉంది. సినిమా టికెట్ ధరల తగ్గింపు వివాదం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో దీనికి చెక్ పెట్టాలని చిరు భావిస్తున్నారట. సినిమా టెకెట్ల అంశం పైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. చిత్ర పరిశ్రమపై వైకాపా నేతల వ్యాఖ్యలను ఏపీ సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.