NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

త్వ‌ర‌లో మోహ‌న్ బాబు యూనివ‌ర్శిటీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ న‌టుడు మంచు మోహ‌న్ బాబు త్వ‌ర‌లో తిరుప‌తిలో మోహ‌న్ బాబు యూనివ‌ర్శిటీని స్థాపించ‌బోతున్నారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వార ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే తిరుపతిలో శ్రీ విద్యానికేత‌న్ స్కూల్స్ మ‌రియు కాలేజ‌స్ న‌డుపుతున్న ఆయ‌న యూనివ‌ర్శిటీ కూడ స్థాపించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. దీనికి యం.బీ.యూగా నామ‌క‌ర‌ణం చేశారు. ‘చిన్న విత్తనాలతో పెరిగిన శ్రీవిద్యానికేతన్ ఇప్పుడు కల్పవృక్షంగా మారింది. 30 ఏళ్ళ మీ నమ్మకం ఇప్పుడు నన్ను విశ్వవ్యాప్తమైన విద్యవైపుకు పురిగొల్పుతోంది. ఆ కృతజ్ఞతతోనే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని స్థాపిస్తున్నాను. మీ ప్రేమే నా బలం. నా ఈ కలకు కూడా మీరు సహకారం అందిస్తారని నమ్ముతున్నాను. నా తల్లిదండ్రులు, అభిమానుల ఆశీస్సులతో నేను ఈ విషయాన్ని వినయపూర్వకంగా ప్రకటిస్తున్నాను’.. అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.

                                             

About Author