NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చైనా మాంజ పై నిషేధం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ‌లో చైనా మాంజ పై అధికారులు నిషేధం విధించారు. సంక్రాంతి సంద‌ర్భంగా చైనా మాంజ ఎక్కువ‌గా విక్ర‌యించే దుకాణాల పై అధికారులు కొర‌డా ఝ‌ళిపిస్తున్నారు. నగరంలోని ధూల్ పెట్, బేగం బజార్‌లో అధికారులు సోదాలు నిర్వహించారు. పలు దుకాణాల్లో నిలువ చేసిన చైనా మాంజను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చైనా మాంజ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. చైనా మాంజ‌ను గాలి ప‌టాలు ఎగుర‌వేయ‌డానికి ఉప‌యోగిస్తారు. వీటిని ఎగుర‌వేసే క్రమంలో ఎన్నో ప‌క్షులు ప్ర‌మాదానికి గురవుతాయి. అదే క్ర‌మంలో గాలిప‌టాలు ఎగుర‌వేసే వ్య‌క్తులు కూడ ప్ర‌మాదానికి గురైన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అధికారులు తెలంగాణ‌లో నిషేధించారు.

                                   

About Author