సీఎం కుమారుడైనంత మాత్రాన టికెట్ ఇవ్వరు !
1 min readపల్లెవెలుగువెబ్ : గోవా మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత మనోహర్ పారికర్ కుమారుడికి బీజేపీ షాక్ ఇచ్చింది. మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడైనంత మాత్రాన టికెట్ ఇవ్వరని గోవా ఇన్చార్జ్ దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. గోవా ఎన్నికల సందర్భంగా పనాజీ నుంచి మనోహరి పారికర్ కుమారుడు ఉత్పల్ టికెట్ కోరిన నేపథ్యంలో ఫడ్నవిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. గోవాలో బీజేపీ స్థాపనకు మనోహర్ పారికర్ కృషి చేశారని తెలిపారు. మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా పనిచేయడంతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా కూడ పనిచేశారు.