ఉద్యోగం బోర్ కొట్టిందని కోర్టుకు.. !
1 min readపల్లెవెలుగువెబ్ : ఉద్యోగం బోర్ కొట్టిందని కోర్టుకు వెళ్లాడో ఉద్యోగి. ఈ ఘటన పారిస్ దేశంలో చోటుచేసుకుంది. ఇంటర్ పర్ఫ్యూమ్ అనే అత్తరు కంపెనీలో పనిచేసే ఫ్రెడరిక్ డేనార్డ్ అనే ఉద్యోగి 2015లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తర్వాతి సంవత్సరం తనకు బోర్ కొట్టే ఉద్యోగం ఇచ్చారంటూ కోర్టుకు వెళ్లాడు. ముఖ్యమైన క్లయింటు చేజారి పోవడంతో తనను చిన్నాచితకా పనులు చేసే మేనేజర్ జాబ్‌కు మార్చారని, దానివల్ల తన మానసిక స్థితి దెబ్బతిన్నదని డేనార్డ్ కోర్టులో వివరించాడు. సదరు ఉద్యోగికి 33 లక్షల పరిహారం ఇవ్వాలని సంస్థను ఆదేశించింది.