అడవిలో అగ్గి జీవరాశికి ముప్పు
1 min read– ములుగు డి ఎఫ్ ప్రదీప్ కుమార్ శెట్టి
పల్లెవెలుగు,ములుగు: వేసవికాలంలో అడవిలో అగ్ని ప్రమాదాల అడ్డుకట్టకు సాంకేతిక సాయంతో ముందడుగు వేస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి ఐ.ఎఫ్.ఎస్ తెలిపారు.వేసవికాలంలో ఏర్పడే కార్చిచ్చు ద్వారా అడవులు, వన్యప్రాణులను సంరక్షించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రణాళికలు రూపొందించామని స్పష్టం చేశారు.నాలుగు డివిజన్ల పరిధిలోని 14 అటవీ క్షేత్రాల్లో కంపార్టుమెంట్ల వారీగా ఫైర్ లైన్స్ ఏర్పాటు పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు.అగ్ని ప్రమాదాల పై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా ప్రతి అటవీ క్షేత్రం పరిధిలో ఐదుగురు ప్రత్యేక సభ్యులతో క్విక్ రెస్పాన్స్ టీం బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు. శాటిలైట్ ఆధారంగా చరవాణులకు సంక్షిప్త సమాచారం అందిన క్షణాల్లోనే సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని మంటలను ఆర్పీ వేస్తారని తెలియజేశారు.ఎవరైనా అడవులకు నిప్పు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.