పొగాకు బోర్డు సభ్యుడిగా జీవీఎల్ నరసింహారావు
1 min readపల్లెవెలుగువెబ్ : పొగాకు బోర్డు సభ్యుడిగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు నియమితులయ్యారు. రాజ్యసభలో ఆమోదించిన తీర్మానం మేరకు జీవీఎల్ నరసింహారావు పొగాకు బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని రాజ్యసభ సెక్రటేరియేట్ లిఖితపూర్వకంగా ఆయనకు తెలియజేసింది. పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయనున్నట్టు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. పొగాకు ఎగుమతుల ప్రోత్సాహానికి కృషి చేయనున్నట్టు తెలిపారు.