శెట్టివీడులో.. ఆధ్యాత్యం..ఆధ్యాత్మికం..
1 min readపల్లెవెలుగు వెబ్ : కాలాన్ని భగవత్స్వరూపంగా భావించే భారతీయులకు ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప పరమార్ధం దాగి ఉన్నదని, దానిని నేటి తరాలవారికి అర్ధమయ్యేలాగా ఆబాలగోపాలాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానములు ఎన్నెన్నో ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామంలోని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు గత ఐదు రోజులు నుండి ( మంగళవారం నుండి శనివారం వరకు )నిర్వహిస్తున్న శ్రీమద్రామాయణం, మహాభారతం, శ్రీమద్భగవద్గీత ప్రవచనాలు సంస్కృత పండితులు పోలేపల్లి రామబ్రహ్మాచార్యులు తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచించారు
. గొడుగు నూరు, నేలంపాడు, మూడురాళ్ళపల్లె, చింతలచెరువు, గ్రామల భజన మండళ్ళు చేసిన భజన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. శుక్రవారం గోపూజ, కుంకుమార్చన, శనివారం భజనలతో ఈ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎర్రోళ్ల లక్ష్మీదేవి, ఎర్రోళ్ల పుల్లయ్య, ఆలయ అర్చకులు షరాబు శంకరాచారి, పోతిరెడ్డి సుబ్బారెడ్డి, పసులూరి ప్రసాదు, వల్లా కొండారెడ్డి, రామనారాయణరెడ్డి, రాము, ఎర్రొళ్ళపుల్లన్న, చీకిరి పుల్లన్న,చిటికెలోల్ల నరసింహుడు తదితరులు పాల్గొన్నారు.