PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్ లో.. సంక్రాంతి సంబరాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​,ఏలూరు : ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్ ఆవరణలో ఇరిగేషన్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు,మరియు ఏపీన్జీవోస్ జిల్లా కార్యదర్శి చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి,ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దేవ ప్రకాష్,ఏలూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంచెమ్ మై బాబు,చొదిమెళ్ల కార్పొరేటర్ బత్తిన విజయ్ కుమార్,పశ్చిమగోదావరి జిల్లా ఏపీన్జీవోస్ అధ్యక్షుడు ఆర్ ఎస్ హరనాధ్,ఇరిగేషన్ డివిజన్ కార్యాలయ సూపురింటెండెంట్ దిరిసాల రవి కుమార్,సర్కిల్ డిప్యూటీ ఎస్ఇ రత్న రమేష్,ఇరిగేషన్ ఉద్యోగుల జిల్లా కార్యదర్శి దాట్ల కనక పుల్లంరాజు,సర్కిల్ సూపురింటెండెంట్ నోరి శ్రీనివాస్,పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ గోవింద రాజులు,ఎన్జీవో సంఘ నాయకులు మద్ది పూడి శ్రీనివాస్,మేరుగ ఫణి కుమార్, ఎవివి వీరేంద్ర.ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డీఈఈ లు.జేఈ లు,మహిళా విభాగం నాయకులు సత్య భారతి,కృష్ణ వేణి,ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ సాంప్రదాయం గా సంక్రాంతి సంబరాలను,అంబరాన్ని తాకే విధంగా నిర్వహించారని,అన్ని పండుగ లకన్నా సంక్రాంతి పండుగ పెద్ద పండుగని,భారత దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ చాలా ఘనంగా నిర్వహిస్తారని, ఇది పూర్తిగా రైతుల పండుగని, రైతు ఆరుగాలం కష్టపడి పంట పండించి తన కుటుంబ సభ్యులు తో,అలాగే తెలుగు రాష్ట్రాల లో ప్రజలు జరుపుకొనే ఒక ఉత్సవమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మంచెమ్ మై బాబు మాట్లాడుతూ గ్రామీణ సంప్రదాయాలను మర్చిపోకుండా ఇలాంటి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న  ఇరిగేషన్ ఉద్యోగులను అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనే మంచి అవకాశం కల్పించిన ఇరిగేషన్ సిబ్బంది ని అభినందించారు,అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. హరనాధ్ మాట్లాడుతూభోగి సంక్రాంతి మరియు  కనుమ పండుగలు హిందూ సంప్రదాయం ప్రకారం జరుపుకునే పండుగ గా అభివర్ణించి, విచ్చేసిన వారందరికి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్జీవో సంఘం తరుపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గులు పోటీలు,ఇతర పోటీల్లో పాల్గొన్న  ఉద్యోగుల కు,ఉద్యోగినులకు ముఖ్య అతిథులు బహుమతీ ప్రధానం చేశారు.

About Author