ఉత్తమ విద్యార్థులకు బహుమతిగా పందులు !
1 min readపల్లెవెలుగువెబ్ : స్కూల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు మన దేశంలో అయితే.. పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు బహుమతిగా ఇస్తారు. కానీ చైనాలో మాత్రం పందులు బహుమతిగా ఇచ్చారు. దీని వల్ల చదవుకు చదువు.. వ్యాపారానికి వ్యాపారం రెండూ వృద్ధి చెందుతాయని చైనాలోని ఆ స్కూల్ ఉపాధ్యాయులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యునాన్ ప్రావిన్స్ ఇలియాంగ్ ప్రాంతంలో ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఉత్తమ విద్యార్థులకు పందులు బహుమతిగా ఇచ్చారు. దీని వల్ల గ్రామీణ వాణజ్యం అభివృద్ధి చెందుతుందని వారు చెబుతున్నారు. పందుల్ని బహుమతిగా ఇస్తే.. వాటిని పిల్లల తల్లిదండ్రులు పెంచి పోషించవచ్చు.. లేదా విక్రయించవచ్చు. ఫలితంగా వ్యాపారం జరిగి పిల్లల తల్లిదండ్రులకు డబ్బు వస్తుంది. దీని ద్వార పిల్లల స్కూలు ఖర్చులు, వస్తువులు కొనుగోలుకు డబ్బు ఉపయోగపడుతుందని ఆర్థిక పాఠాలు చెబుతున్నారు ఉపాధ్యాయులు.