ఏపీలో సెలవుల పొడిగింపు.. మంత్రి క్లారిటీ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో సంక్రాంతి సెలవుల పొడిగింపు పై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో సంక్రాంతి సెలవుల పొడిగింపు ఆలోచన లేదని .. ప్రకటించిన విధంగా యధావిధిగా పాఠశాలలు నడుస్తాయని మంత్రి స్పష్టతనిచ్చారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రత తో పాటు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశామని, 15 నుంచి 18 సంవత్సరాల వయసు విద్యార్థులకు కూడా దాదాపు 92 శాతం వ్యాక్సిన్ వేయడం జరిగిందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు నిర్వహిస్తామని తెలిపారు. అదే సమయంలో వారి ఆరోగ్యం పట్ల కూడ శ్రద్ధ తీసుకుంటామని చెప్పారు.