అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేసిన ఈసీ
1 min readపల్లెవెలుగువెబ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. వివిధ రాజకీయా పార్టీలు వాయిదా వేయాలని కోరిన నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారంనాడు ఎన్నికలు నిర్వహిస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. “ఏటా ఫిబ్రవరి 16న జరిగే శ్రీ గురు రవిదాస్ జీ జయంతి ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో పంజాబ్ ప్రజలు యూపీలోని వారణాసికి వెళ్తుంటారని రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీల ప్రతినిధులు కమిషన్ దృష్టికి తెచ్చారు. 14న ఎన్నికలు ప్రకటించడం వల్ల వారంతా ఓటింగ్‌లో పాల్గొనే అవకాశాం కోల్పోతారని విన్నవించారు. దీనిపై కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, చీఫ్ ఎలక్టోరల్ అధికారి నుంచి సమాచారం తీసుకుంది. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని అసెంబ్లీ ఎన్నికల తేదీని రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించాం” అని ఈసీ ఆ ప్రకటనలో తెలిపింది.