నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. వరుస లాభాలతో ర్యాలీ కొనసాగించిన సూచీలు మంగళవారం నష్టాలతో క్లోజ్ అయ్యాయి. ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమై అనంతరం నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల ఫలితాల నేపథ్యంలో కరెక్షన్ కు గురయ్యాయి. ప్రధానంగా ఆటో, ఐటీ, ఫార్మా, మెటల్ సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. సెన్సెక్ 554 పాయింట్లు నష్టపోయి 60754 వద్ద, నిఫ్టీ 195 పాయింట్లు నష్టపోయి 18113 వద్ద ముగిశాయి.