ఐదు రోజుల పెళ్లి.. అంగరంగ వైభవంగా ఆన్ లైన్ లో… !
1 min readపల్లెవెలుగువెబ్ : పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. మంగళవాయిద్యాలు, పట్టువస్త్ర్రాలు, తలంబ్రాలు, పచ్చనితోరణాలతో కళకళలాడుతూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవడం ఇప్పటి వరకు మనం చూశాం. కానీ కరోన పుణ్యామా అని కొత్త ట్రెండ్ వెలుగులోకి వచ్చింది. అదే ఆన్ లైన్ పెళ్లి. గూగుల్ మీట్ లో బంధువులంతా వధూవరులను వీక్షిస్తారు. ఆశీర్వదిస్తారు. పెళ్లి భోజంన జొమాటా ద్వార బంధువుల ఇంటికే నేరుగా చేరుతుంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ జంట వినూత్నమైన ఆన్ లైన్ పెళ్లికి శ్రీకారం చుట్టింది. అబ్బాయి పేరు సందీపన్ సర్కార్, అమ్మాయి అదిథి దాస్. వీరు జనవరి 24న పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే వీరి పెళ్లి ఏడాది క్రితమే జరగాల్సిందట. కానీ కొవిడ్ కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. కానీ కొవిడ్ ప్రభావం తగ్గకపోవడంతో గూగుల్ మీట్ ద్వారా అతిథుల సమక్షంలో పెళ్లికి సిద్ధమయ్యారు.