PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వర్గీకరణ జోలికొస్తే.. రాజకీయ పతనం తప్పదు..

1 min read

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు:  ఆంధ్ర ప్రదేశ్​లో రెండేళ్లుగా పెండింగ్​లో ఉన ఎస్సీ కార్పొరేషన్​ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. బుధవారం కర్నూలు పట్టణం అంబేద్కర్ భవన్​లో జిల్లా అధ్యక్షులు జై భీమ్ సాయిరాం ఆధ్వర్యంలో మాలమహానాడు ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన  జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య మాల మహానాడు రాయలసీమ ఇన్చార్జి ఎం నరసప్ప, గౌరవ అధ్యక్షులు ఆంజనేయులు, రజోలప్ప , కేశవ్ మాస్టర్  డా.బీఆర్​. అంబేద్కర్  విగ్రహానికి  పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.  అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అధ్యక్షులు జి. చిన్నయ్య నర్సప్ప, జై భీమ్ సాయిరాం  మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సి  బ్యాక్​ లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు  పెంచి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.  2004 సంవత్సరంలో రద్దు చేయబడిన వర్గీకరణ  అంశమును రాజకీయ లబ్ధి కోసం మందకృష్ణ మాదిగ తెరపైకి తెచ్చి అమాయక ప్రజల జీవితాలతో చెలగాటమా డుతున్నారని,  అందుకు వత్తాసు పలికిన ఏ రాజకీయ పార్టీల కైనా పతనం తప్పదన్నారు.  ఫిబ్రవరి 12న హైదరాబాద్ లో  ఏర్పాటుచేయాబోయే మాలల సింహ గర్జన సభకు తెలుగు రాష్ట్రాల మాలలు వేలాదిగా తరలివచ్చి మాలల సత్తా చాటాలని పిలుపునిచ్చారు .

కర్నూలుకు …సంజీవయ్య పేరు పెట్టాలి

కర్నూలు జిల్లాకు దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు నామకరణం చేయాలని డిమాండ్ చేశారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య.  రాష్ట్రంలో మాలలు అత్యధికంగా ఉన్న గ్రామాలను గుర్తించి మాల కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేయాలని కర్నూలు లో వున్న అంబేద్కర్ భవన్ శిథిలావస్థకు చేరుకుందని నిధులు కేటాయించి మరమ్మతులు చేయాలని కోరుతూ  కర్నూలు అంబేద్కర్ భవన్ మరమ్మతులకు కేటాయించడం 74  లక్షల రూపాయలు నిధులు ఏమైనట్లు అని దానికి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆదోని డివిజన్ అధ్యక్షులు ఎల్లప్ప, పట్టణ యూత్ అధ్యక్షులు అశోక్, మాధవ స్వామి, రమేష్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

About Author