సీఎస్ సమీర్ శర్మ మోసం చేశారు !
1 min readపల్లెవెలుగువెబ్ : సీఎస్ సమీర్ శర్మ లెక్కలన్నీ తప్పులతడక అని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అన్నారు. సీఎస్ ఉద్యోగుల్ని మోసం చేశారని ఆరోపించారు. పీఆర్సీతో జీతం పెరుగుతుందని అబద్ధం చెబుతున్నారని అన్నారు. కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 3 జీవోలను బేషరతుగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల అంగీకారం లేకుండా ప్రభుత్వమే ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించారు. జీవోలు రద్దు చేసేవరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లమని స్పష్టం చేశారు. డీఏలు ఇచ్చి జీతంలో కోత విధించడం మోసపూరితమన్నారు. కేంద్ర పే స్కేల్‌ను అమలు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. తాం దాచుకున్న డబ్బును ఎక్కడికి మళ్లించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.