బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
1 min readపల్లెవెలుగు వెబ్, మహానంది: మహానంది మండలం బొల్లవరం గ్రామం చెందిన గుండా రమణయ్య అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం మృతి చెందారు. మృతుని కుటుంబానికి వైయస్సార్ బీమా పథకం ద్వారా పదివేల రూపాయలను ఎంపీపీ యశస్విని, ఎంపీడీవో సుబ్బరాజు, వ్యవసాయ శాఖ ఏ ఓ సుబ్బారెడ్డి ఆర్థిక సహాయంగా అందజేశారు .ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా పేదలకు అనేక విధాలుగా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తుందని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.