PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తాగి తోలితే.. వెంట‌నే ర‌ద్దు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డ‌్రంక‌న్ డ్రైవ్ చేసే వారి పట్ల ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌నుంది. డ్రంక‌న్ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డితో వేగ‌వంతంగా లైసెన్స్ ర‌ద్దు చేసే ప్ర‌క్రియకు ప్ర‌భుత్వం ఉపక్ర‌మించింది. తాగి వాహనం తోలుతూ పోలీసులకు పట్టుబడితే పత్రాలను స్వాధీనం చేసుకొని.. రవాణా శాఖ అధికారులకు పంపడం.. వాటిని వారు పరిశీలించిన మీదట లైసెన్స్‌ రద్దు చేయడం ఇలా సుదీర్ఘ ప్రక్రియకు చెక్‌ పడనుంది. ఇందుకోసం ప్రత్యేక మొబైల్‌ యాప్ తయారు చేశారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడి.. జరిమానాలు కట్టి.. చివరికి జైలు శిక్ష కూడా అనుభవించినా తాగి రోడ్ల పైకి వాహనాలతో వచ్చేవారికి నిబంధనల ప్రకారం డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నారు. ఇందుకుగాను హైదరాబాద్‌లోని ట్రాఫిక్‌ పోలీసులు కొత్త తరహాలో ముందుకొస్తున్నారు. తాగి వాహనం నడిపిన వారి డ్రైవింగ్‌ లైసెన్సును క్షణాల్లో కేన్సిల్‌ చేసే విధంగా ఓ యాప్‌ను రూపొందించారు. దానిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న అధికారులకే పూర్తి అధికారాలు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

                            

About Author