స్టాక్ మార్కెట్ చమురు వదిలిస్తోన్న ధరలు !
1 min read
పల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముడిచమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ భయాలు ఇవ్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. దీంతో వరుసగా సూచీలు నష్టాల బాటపట్టాయి. ఉదయం నుంచే సూచీల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. అంతర్జాతీయంగా వివిధ మార్కెట్లు మిశ్రమంగా కదులుతున్నాయి. 2 గంటల సమయంలో సెన్సెక్స్ 861 పాయింట్ల నష్టంతో 59246 వద్ద, నిఫ్టీ 235 పాయింట్ల నష్టంతో 17702 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 357 పాయింట్ల నష్టంతో 37684 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.