తొలి ఫ్లైట్.. కర్నూలులో ల్యాండ్..
1 min readజాతీయ జెండా ప్లాగ్ వేవ్ చేసి… ఆవిష్కరించిన ఆర్థిక మంత్రి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు ఎయిర్‌పోర్ట్‌లో తొలిప్యాసింజర్ ఫైట్స్( ఇండిగో) బెంగుళూ నుంచి కర్నూలులో ల్యాండ్ అయింది. అదేవిధంగా కర్నూలు– విశాఖపట్నం బయలుదేరింది. అంతకు ముందు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్..కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం..ఎంపీలు పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఏపీ ఎయిర్ పోర్ట్స్ డేవేలప్మెంట్ కార్పొరేషన్ ఎండి భరత్ రెడ్డి, ఎస్పీ డా.ఫక్కీరప్ప, జేసీలు రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు తదితరులు, ఓర్వకల్ సర్పంచ్ తోట అనూష తొలిప్యాసింజర్ ఫ్లైట్స్‌కు జాతీయ జెండా ప్లాగ్ వేవ్ వేసి.. ఆవిష్కరించారు.
తొలి ప్యాసింజర్స్‌కు ఘనస్వాగతం..
బెంగళూరు-కర్నూలు తొలి ప్యాసింజర్ ఫ్లైట్ (ఇండిగో 6E7911) ను పైలట్ కర్నూలు వాసి వీరా నడపగా… ..తొలి ప్యాసింజర్స్ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, బెంగళూరు నాగరబావి నివాసి రాంప్రసాద్ దంపతుల కూతురు సాయి ప్రతీక్ష(6 సంవత్సరాలు) లకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ, ఎయిర్ పోర్ట్ అధికారులు, ఇండిగో సంస్థ అధికారులు పూల మొక్కలను ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.
హ్యాపీ.. జర్నీ..
కర్నూలు విమానాశ్రయం నుండి విశాఖపట్నం బయలు దేరిన తొలి ప్యాసింజర్ ఫ్లైట్ (ఇండిగో 6E 7912) కు జాతీయ జెండా ఊపి ప్రారంభించి ఊపి ప్రారంభించారు ఆర్థిక మంత్రిబుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం..లోకల్ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, లోకల్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఏపీ ఎయిర్ పోర్ట్స్ డేవేలప్మెంట్ కార్పొరేషన్ ఎండి భరత్ రెడ్డి, ఎస్పీ డా.ఫక్కీరప్ప, జేసీలు రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు. ప్యాసింజర్స్‌కు స్వీట్స్ అందజేసి.. హ్యాప్పీ జర్నీ అంటూ… సంతోషం వెలిబుచ్చారు.