నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని చస్తా !
1 min readపల్లెవెలుగువెబ్ : గుడివాడ క్యాసినో వివాదం పై మంత్రి కొడాలి నాని స్పందించారు. సంక్రాంతి పండగకి అన్ని చోట్ల జరిగినట్టే గుడివాడలో కూడ.. జూదం, కోడిపందేలు జరిగాయని, మహిళలను తీసుకొచ్చి డ్యాన్స్ వేయిస్తున్నారని తెలిస్తే తానే స్వయంగా డీఎస్పీకి ఫోన్ చేశానని కొడాలి నాని తెలిపారు. జూదం నిర్వహించానన్న ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుని, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. టీడీపీ నేతలకు ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పారు. క్యాసినో వ్యవహారం పై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఇవాళ గుడివాడకు వెళ్లింది. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలను పోలీసులు అదుపు చేశారు.