క్యాసినో వివాదం.. కొడాలి నానికి సంబంధం లేదు !
1 min readపల్లెవెలుగువెబ్ : గుడివాడ క్యాసినో నిర్వహణలో ఏపీ మంత్రి కొడాలి నానికి సంబంధం లేదని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. గుడివాడలో క్యాసినో వివాదం పై రఘురామకృష్ణరాజు స్పందించారు. ఏపీ మంత్రి కొడాలి నానికి గుడివాడ క్యాసినో వ్యవహరంలో సంబంధం లేకపోయినా.. కొందరు ఆయనను అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారు ?.. క్యాసినో డబ్బు ఎవరికి వెళ్లింది? తదితర విషయాలు వెల్లడి కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.