క్యాసినో వీడియో బయటపెట్టిన టీడీపీ నేత !
1 min readపల్లెవెలుగువెబ్ : గుడివాడ క్యాసినో వివాదం ఏపీలో రచ్చ లేపింది. క్యాసినో జరిగిన ప్రాంతంలో టీడీపీ నిజనిర్దారణ కమిటీ పర్యటించే ప్రయత్నం చేసింది. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. గుడివాడలోని కే కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో నిర్వహించినట్టు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని చస్తా అని కొడాలి నాని సవాల్ విసిరారు. దీంతో టీడీపీ ప్రతి సవాల్ విసిరింది. క్యాసినో ఘటన జరిగిందని నిరూపిస్తామని టీడీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర గుడివాడలోని కే కన్వెన్షన్ లోని ఓ వీడియోను బయటపెట్టారు. దీంతో ఈ వీడియో ఏపీలో సంచలనంగా మారింది.