పండ్లను మాగబెట్టేందుకు ఇథెపాన్ వాడొచ్చు !
1 min readపల్లెవెలుగువెబ్ : మామిడి, బొప్పాయి వంటి పండ్లను మాగబెట్టేందుకు ఇథెపా సాచెట్స్ వినియోగం సబబేనని తెలంగాణ హైకోర్టు తేల్చింది. క్రిమిసంహారక మందుల్లో వినియోగించే ఈథెఫోన్‌ను వినియోగించి ఫలాలను పండించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి హానికలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ సికింద్రాబాద్ యాప్రాల్‌కు చెందిన నలిన్ వెంకట్ కిశోర్‌కుమార్, ఏపీ ట్రాన్స్‌కో విశ్రాంత ఉద్యోగి ఎల్. రమేశ్‌బాబు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినందన్‌కుమార్ షావిలిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ దేశవ్యాప్తంగా పండ్లను మాగబెట్టేందుకు అన్ని ప్రాంతాల్లో ఇథలీన్ గ్యాస్ ఛాంబర్లు అందుబాటులో లేవని.. అవి లేని చోట ఈథెఫోన్ సాచెట్స్ వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈథెఫోన్ పురుగుమందుగా గుర్తింపు పొందిందని.. అయితే ఈథెఫోన్ ఉత్పత్తి చేసే ఇథలీన్ గ్యాస్‌ను పంటల ఎదుగుదలకు గ్రోత్ హార్మోన్‌గా వినియోగిస్తారని తెలిపారు. అన్నిరకాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. కార్బైడ్ వినియోగాన్ని నిరోధించేందుకు శాస్ర్తీయ అధ్యయనం తర్వాతే ఎఫ్ఎస్ఎస్ఐ రెగ్యులేషన్స్ జారీచేందని అభిప్రాయపడింది. గత ఏడాది జూలైలో ఎఫ్ఎస్ఎస్ఏఐ 20వ సైంటిఫిక్ ప్యానెల్ ఈథెపాన్ వినియోగాన్ని ధ్రువీకరించిందని పేర్కొంది. ఈ నేథ్యంలో ఈథెఫోన్ వినియోగం సబబేనని తెలిపింది.