‘ మోటరైజ్డ్ వెహికల్’కు దరఖాస్తుల ఆహ్వనం
1 min read– జాయింట్ కలెక్టర్ ( ఆసరా& సంక్షేమం) సయ్యద్ ఖాజా మొహిద్దీన్
పల్లెవెలుగు, కర్నూలు: విభిన్న ప్రతిభావంతులకు మోటరైజ్డ్ మూడు చక్రాల వాహనాల పంపిణీకి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. విభిన్న ప్రతిభావంతుల సాధికారత కోసం మోటరైజ్డ్ మూడు చక్రాల వాహనాలు అందించాలని సంకల్పించారు. అర్హులైన విభిన్న ప్రతిభావంతులు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ( ఆసరా మరియు వెల్ఫేర్) సయ్యద్ ఖాజా మొహిద్దీన్ తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి… అర్హులైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నియమ నిబంధనలు పాటించని వారు.. అలాగే ప్రభుత్వం కల్పించిన సదుపాయాన్ని దుర్వినియోగం చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ సయ్యద్ ఖాజా మొహిద్దీన్ స్పష్టం చేశారు.
అర్హతలు- నిబంధనలు
- వయసు: అతడు\ఆమె 18-45 సంవత్సరాలలోపు వయసు ఉండాలి.
- శారీరక వికలాంగుడై ఉండాలి. ఒకటి లేదా రెండు కాళ్లు వైకల్యం ఉండాలి. 70 శాతం లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉండాలి.
- రెగ్యులర్ గా గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులు. అలాగే గ్రాడ్యుయేషన్ పైన చదువుతున్న బోనఫైడ్ విద్యార్థులు
- స్వయం ఉపాధి కలిగి ఉండాలి. సంబంధిత వృత్తిలో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి. కనీసం పదవతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ( వ్యవసాయం లేదా ఇతర రంగాలు- జీతం, వేతనం కలిగి ఉండాలి.)
- కటుంబ సంవత్సర ఆదాయం 3 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు.
- మోటార్ వెహికల్ చట్టం ప్రకారం.. డ్రైవింగ్ లైసెన్స్ ను ఎంపికైన తేది నుంచి రెండు నెలలలోపు పొందాలి.
- దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ స్థానికుడై ఉండాలి.
- గతంలో ఏ విధంగాను మోటరైజ్డ్ వెహికల్ పొంది ఉండకూడదు.
- అభ్యర్థి రెండు లేదా మూడు లేదా నాలుగు చక్రాల మోటరైజ్డ్ వెహికల్ సొంతంగా ఉండకూడదు.
- అభ్యర్థి సొంత జిల్లా నుంచి ఒకసారే దరఖాస్తు చేసుకోవాలి.
- రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వెహికల్ జీవితంలో ఒకసారి మాత్రమే పొందేందుకు అర్హులు.
- ఉపకరణాల సహాయంతో నడవగలిగే వారు ఈ పథకానికి అర్హులు కాదు.
అర్హత కలిగిన వారు కింది సెల్ప్ అటెస్టెడ్ డాక్యుమెంట్లతో ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోవచ్చు.
-సదరం సర్టిఫికెట్
-ఆధార్ కార్డు
-ఎస్ఎస్ సీ సర్టిఫికెట్(10 వతరగతి)
-కుల ధృవీకరణపత్రము( ఎస్సీ,ఎస్టీలు)
-పాస్ పోర్ట్ సైజ్ ఫోట్( వికలాంగత్వం కనిపించేలా)
-కొత్త ఆధాయ ధృవీకరణ పత్రము
-బోనపైడ్ సర్టిఫికేట్( ప్రస్తుతం చదువుతున్ విద్యాసంస్థ నుంచి)
-సంబంధిత ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ నుంచి .. ఒక సంవత్సరం నుంచి స్వయం ఉపాధి లేదా వేతనం పొందుతున్నట్టు ధృవీకరణ పత్రము.
-గతంలో ఏ విధంగాను రిట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వెహికల్ పొందలేదని స్వీయ ధృవీకరణ పత్రము
- పైన పేర్కొన్న నిబంధనలు అతిక్రమించినా, కుట్రపన్నిన, విభిన్న ప్రతిభావంతులకు ఇబ్బందులు కలిగించానా ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకు సిద్దమని స్వీయ ధృవీకరణ పత్రము ఇవ్వాలి.