జగన్నాథగట్టుపై.. పచ్చదనం
1 min read
పల్లెవెలుగు వెబ్: కర్నూలు మండలం లక్ష్మీపురం జగన్నాథ గట్టుపై డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి నేతృత్వంలో మొక్కలు నాటారు. గట్టుపై చెత్తను తొలగించి..చదును చేశారు. ఈ సందర్భంగా డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ జగన్నాథగట్టు పచ్చదనంతో కళకళలాడాలని, రూపాల సంగమేశ్వరం దేవాలయంకు వెళ్లే రోడ్డు అంతా శుభ్రంగా ఉండాలన్న సదుద్దేశంతో మొక్కలు నాటామన్నారు. రూపాల సంగమేశ్వర స్వామి నుండి లక్ష్మీపురం జగన్నాథ గట్టు వరకు పచ్చదనం అభివృద్ధి పనుల కోసం కావలసిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దాతల సహకారంతో మొక్కల పెరుగుదలకు కావాల్సిన నీటి సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో డ్వామా సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.