నాటుసారా తరలిస్తూ.. ఇద్దరి అరెస్టు
1 min readపల్లెవెలుగు వెబ్, గడివేముల: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని కాల్వ బుగ్గ నుంచి కొమ్ము చెరువు పోయేదారిలో ఆదివారం నాటుసారా తరలిస్తుండగా … అరెస్టు చేసినట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. కర్నూలు డీఎస్పీ మహేష్ ఆదేశాల మేరకు… కర్నూలు రూరల్ సీఐ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి నాటుసారా తరలిస్తున్న వారిని పట్టుకున్నట్లు ఎస్ఐ మల్లికార్జున వివరించారు. బేతంచెర్ల మండలం శంకరాపురం గ్రామానికి చెందిన ఇత్తడి కృష్ణుడు, మిలిటరీ మద్దిలేటి అనే వ్యక్తులు ( బైక్ నెం. ఏపీ AP21 BX 2898 ) సారా తరలిస్తుండగా… కొమ్ము చెరువు వెళ్లేదారిలో పట్టుకుని వారి వద్ద ఉన్న 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. బైక్ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మల్లికార్జున హెచ్చరించారు. ఓర్వకల్ పోలీసులు మద్దిలేటి, రంగన్న, రాఘవేంద్ర మరియు గోవింద నాయక్ ఉన్నారు.